![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-353 లో.. జరిగింది తల్చుకొని రామరాజు ఫ్యామిలీ అంతా భాదపడుతుంటారు. అప్పుడే ప్రేమ బయట నుండి ఏడుస్తూ వస్తుంది. పెద్దబావ అని ప్రేమ ఏదో చెప్పబోతుంటే .. ఆపమ్మా.. ఇందాక నువ్వు మాట్లాడిందంతా విన్నాను.. నువ్వేంటో అర్థమైంది.. మీ వాళ్లు తప్పు చేసినా సరే మీ వాళ్ళకే సపోర్ట్ చేస్తావని అర్థమైంది. ఇక నువ్వు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా అంటాడు. ఇక తను సాగర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటుంది. తను కూడా అలాగే అంటాడు.
ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి.. మామయ్య.. నన్ను క్షమించు అని ప్రాధేయపడుతుంది. నువ్వు.. మీ నాన్న అన్నవన్నీ నిజమే.. ఆడపిల్లని సరిగ్గా పెంచడం చేతకాని ఓ తండ్రిని అమ్మ నేను అని రామరాజు అనగా.. అయ్యో మామయ్య అంటూ ప్రేమ అంటుంటే రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఇక ఆ తర్వాత వేదవతి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతుంది ప్రేమ. నలుగురిలో ఈ ఇంటి ఆడపిల్ల పరువు తీసి నాకు కడుపు కోతని మిగిల్చావ్.. మా కూతిరిని ఎలా పెంచామో మాకు తెలుసు.. ఎంత పద్దతిగా పెంచామో మాకు తెలుసు.. ఆ వెదవ నా కూతరికి ఏదో మందుపెట్టాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. గుమ్మమే దాటని కూతురు వాడిని ప్రేమిస్తుందా.. నా కూతురు ఏ తప్పు చేయలేదని ప్రేమతో వేదవతి అంటుంది. ఆడపిల్లని ఎలా పెంచాలో మీ వాళ్ళకి తెలియదు కాబట్టే నువ్వు లేచిపోయావని నోటి దాటాక వచ్చింది.. కానీ వేదవతి ఆగిపోయింది వెంటనే.. ఇక తనని తిట్టి వేదవతి వెళ్తుంది. ఇక ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోయింది.
శ్రీవల్లి దొంగచాటుగా ఇంటి నుండి బయటకు వెళ్తుంది. అప్పుడే చెట్ల వెనుక దాక్కున్న భాగ్యం, ఆనందరావు పిలుస్తారు. మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ.. నువ్వు చెప్పినట్లే వేదవతి, నర్మద, ప్రేమ మధ్య గొడవలు మొదలయ్యాయని భాగ్యంతో శ్రీవల్లి చెప్తుంది. ఇదే సరైన సమయం.. నువ్వు వాళ్ల మధ్య గొడవ పెంచమని చెప్తుంది. కాసేపు అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ధీరజ్ దగ్గరకి ప్రేమ వెళ్ళి ఏడుస్తుంది. అత్త ఎలా అందో విన్నావా అంటూ ప్రేమ అనగానే.. చాలు ఆపేయ్ నీ నాటకం.. అక్కడ అలా నటించావ్.. ఇక్కడ ఇలా నటిస్తున్నావని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ ఏడ్చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |